Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 12:20:21
facebook Twitter Googleplus
Photo

వన్ తో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. పవన్ డైరెక్టర్ అనే స్టాంప్ మాత్రం పడిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ తో కలిసి దాదాపు ఏడాది వర్క్ చేసిన సంపత్ నంది.. ఆ తర్వాత బెంగాల్ టైగర్.. గౌతమ్ నంద అంటూ తన సినిమాలకు పవన్ ను గుర్తు చేసే టైటిల్స్ నే పెడుతూ పవర్ స్టార్ పై అభిమానాన్ని చాటుకుంటున్నాడు.

ప్రస్తుతం గోపీచంద్ తో గౌతమ్ నంద చిత్రాన్ని ఫినిష్ చేస్తున్న సంపత్ నంది.. కొత్త వెంచర్ ను ప్రకటించాడు. గతంలోనే సంపత్ నంది క్రియేటివ్ వర్క్స్(పవన్ కళ్యాణ్ బ్యానర్ పేరు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని గుర్తు తెచ్చుకుండే) అంటూ ఓ బ్యానర్ స్టార్ట్ చేసిన ఈయన.. గాలిపటం చిత్రాన్ని నిర్మించగా.. ఇప్పుడు 'పేపర్ బోయ్' అనే చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. సంపత్ నందితో పాటు.. ప్రచిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై వెంకట్.. అలాగే బీఎల్ఎన్ సినిమా బ్యానర్ పై నరసింహ.. ఈ ముగ్గురూ కలిసి పేపర్ బోయ్ ని నిర్మించనున్నారు. సంతోష్ శోభన్.. ఐశ్వర్య వాట్కర్ లు నటించనున్న ఈ మూవీకి.. జయ్ శంకర్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు.

బిల్లా.. మాత్రన్.. బోగన్.. బెంగాల్ టైగర్.. గౌతమ్ నంద వంటి చిత్రాలకు కెమేరా వర్క్ అందించిన సౌందర్ రాజన్.. పేపర్ బోయ్ సినిమాటోగ్రాఫీ అందించనుండగా.. కథ స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ ను సంపత్ నంది అందించనున్నాడు.

,  ,  ,  ,  ,