Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2016 16:16:58
facebook Twitter Googleplus
Photo

సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ విడుదలయ్యే వరకూ వార్తల్లో నలిగిన వంగవీటి సినిమా - విడుదల అనంతరం మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా విడుదలయినప్పటి నుంచీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు - వంగవీటి రంగ అభిమానులకు మధ్య జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు! ఆ సంగతులు కాసేపు పక్కన పెడితే... ఇలాంటి సినిమాలో పూర్తిస్థాయిలో ధమ్మున్న పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు సందీప్ కుమార్ (శాండి). తాజాగా ఈ సినిమాపైనా ఈ సినిమాలో అవకాశం రావడంపైనా ఆ సినిమాపై జరుగుతున్న తాజా పరిస్థితులపైనా స్పందించాడు శాండి.

సమాజంలో బలమైన పాత్రలను - జనాలపై తీవ్ర ప్రభావం చూపించిన సంఘటనలు ఆధారం చేసుకుని సినిమాలు తీసేవర్మ.. గతంలో తెరకెక్కించిన రక్త చర్తిత్ర సినిమాలో సీనియర్ నటులను స్టేచర్ ఉన్న ఆర్టిస్టులను పెట్టుకుని పాత్రలు గుర్తుండేలా చేశాడు. కానీ తాజా వంగవీటి చిత్రంలో మాత్రం కొత్తవారికి అవకాశం ఇచ్చాడు!! వంగవీటి రాధా - వంగవీటి మోహనరంగా లాంటి పాత్రలు చేయాలంటే స్టేచర్ ఉన్న సీనియర్ నటుడెవరైనా అయ్యుండాలని చాలా మంది భావించి ఉంటారు కానీ తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసిన సందీప్ కుమార్ ను ఈ పాత్రలకు ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు వర్మ. ఈ సమయంలో వర్మ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ సందీప్ కూడా చక్కటి నటనతో మెప్పించాడు!

ఇలాంటి వెయిట్ ఉన్న పాత్రలు చేస్తుండటం పైగా వివాదాస్పద నేపథ్యం ఉన్న సినిమా కావడంతో భయం వేయలేదా అని శాండీని అడిగితే మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నాడు! పైగా ఈ సినిమా తీసేది వర్మగారు కాబట్టి భయం వేయడమే కాదుఅసలు అలాంటి ఆలోచనే రాలేదని చెబుతున్నాడు. పూరి జగన్నథ్ తీసిన జ్యోతిలక్ష్మీ - లోఫర్ సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన శాండి.. పూరి తనకు గాడ్ ఫాదర్ లాంటి వాడని చెబుతున్నాడు. ఈ వంగవీటి చర్చలు జరుగుతున్న రోజుల్లో పూరీ ఆఫీస్ లో శాండిని చూసిన వర్మ... "నీతో సినిమా తీయాలనుకుంటున్నాను" అని అనడం వెంటనే లుక్ మార్చుకుని స్క్రీన్ టెస్ట్ కు వెళ్లడం... వెంటనే వర్మ "ఓకే" చెప్పేయడం జరిగిపోయిందట!!

,  ,  ,  ,  ,