Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 11:30:46
facebook Twitter Googleplus
Photo

సంఘమిత్ర మూవీ వివాదం సంగతి తెలిసిందే. కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సాక్షిగా ప్రారంభమైన చిత్రంలో.. లీడ్ రోల్ సంఘమిత్ర పాత్ర నుంచి తప్పకుంటున్నట్లు శృతి హాసన్ చెప్పడం సెన్సేషన్ అయింది. ఆమె చెప్పే కంటే ముందే.. శృతితో కంటిన్యూ కావడం లేదంటూ నిర్మాతల నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చేసింది.

తప్పుకోవడంపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చిన తర్వాత ఎవరూ దాని గురించి మాట్లాడలేదు కానీ.. సంఘమిత్ర పాత్ర ఎవరు చేయనున్నారనే అంశం మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది. ఇప్పుడీ రోల్ కోసం అనుష్క.. తమన్నాలతోపాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను కూడా సంప్రదిస్తున్నారనే టాక్ ఉంది. బాహుబలితో క్రేజ్ సంపాదించుకున్న స్వీటీ.. తమ్ము కంటే దీపికాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. బడ్జెట్ రీత్యా దీపికా పదుకొనే అయితే.. తమ సినిమాకు వెయిట్ బాగా పెరుగుతుందని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. కానీ సంఘమిత్ర రోల్ చేసేందుకు ఈ బాలీవుడ్ బ్యూటీ ఏ మాత్రం సిద్ధపడుతుందనే విషయం సందేహమే.

ఎందుకంటే.. సంఘమిత్ర మూవీ కోసం రెండేళ్ల పాటు టైం కేటాయించాలి. రెండు పార్ట్ లుగా వచ్చినా.. అంత లాంగ్ టైం ఒక్క సినిమాకి దీపిక కేటాయించే ఛాన్సెస్ తక్కువ. సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ డైరెక్టర్ రూపొందిస్తున్న పద్మావతి చిత్రానికే దీపిక పట్టుమని 9 నెలలు టైం ఇచ్చింది.

,  ,  ,  ,  ,  ,