Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 11:34:26
facebook Twitter Googleplus
Photo

బుజ్జిగాడు మూవీలో ప్రభాస్ మరదలిగా టాలీవుడ్ సినిమాల్లో తనదైన స్టాంప్ వేసిన సంజనా గల్రాని.. ఆ తర్వాత మాత్రం జోరు తగ్గించుకుంది. గతేడాది పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించిన సంజన.. ఇప్పుడు ఓ కమెడియన్ హీరో సినిమాలో నటించబోతోంది.

తెలుగులో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నా.. కన్నడ-మలయాళ భాషల్లో మాత్రం సంజనకు చేతి నిండా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సునీల్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళీ మూవీ టు కంట్రీస్ తెలుగు రీమేక్ లో.. సంజనా గల్రానికి ఓ కీలకమైన ఆఫర్ చేశారు. ఇప్పటికే ఈ పాత్రకు అంగీకరించగా.. ఈమె రోల్ కు సంబంధించిన షూటింగ్ అమెరికాలో జరగనుంది. ఎన్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కాకపోయినా.. సంజన పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.

మరోవైపు తెలుగు బుల్లితెరపై కూడా సంజనకు లెక్కకు మించిన ఆఫర్స్ వస్తున్నాయని తెలస్తోంది. ఇప్పటివరకూ ఫైనల్ డెసిషన్ తీసుకోకపోయినా.. త్వరలో తెలుగు టెలివిజన్ లో ఓ కార్యక్రమానికి బుజ్జిగాడి మరదలు హోస్ట్ గా కనిపించనుండడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,