Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 10:54:08
facebook Twitter Googleplus
Photo

సమ్మర్ లో వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా గ్యాప్ తీసుకుని మరీ సినిమా మొదలుపెట్టేశాడు. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మహేష్ రోల్ పై రకరకాల అంచనాలు ఉన్నాయి. ఇంటెలిజెనస్ బ్యూరోలో పని చేస్తాడని.. కాదు కాదు పోలీస్ పాత్రే అని అంచనాలుండగా.. ఇప్పుడు సూపర్ స్టార్ గురించి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సూపర్ కబురు చెప్పేశాడు.

చెన్నైలోని ఈవీపీ వరల్డ్ భారీ సెట్స్ మధ్య మహేష్-మురుగ సినిమా షూటింగ్ జరుగుతుండగా 'సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనర్జీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. మహేష్ బాబు చెన్నైలో పని చేయడం ద్వారా.. మొత్తం చెన్నైకే ఎనర్జీ వచ్చేసింది. అంత స్టార్ పవర్.. ఈ సూపర్ స్టార్ సొంతం. భారీ సినిమాలు చేయడం మహేష్ కు.. చెన్నైకి కొత్త కాకపోయినా. - ఇలా మహేష్ మూలంగా చెన్నైకి కళ వచ్చిందని. సిమాటోగ్రాఫర్ అంటున్నాడు. ఈయన చెప్పాడని కాదు కానీ.. మహేష్ ని చూసినోళ్లు చాలామంది ఇలాంటి మాటలే చెబుతుంటారు.

ఆన్ స్క్రీన్ పై చూసిన అభిమానులే అంత ఎనర్జీ పొందుతుంటే.. ఇక సూపర్ స్టార్ ని అంత క్లోజ్ గా తన మూడో కన్నయిన కెమేరాతో చూసిన ఫోటోగ్రాఫర్ ఇలా ఫీలవడంలో తప్పులేదంతే.

,  ,  ,  ,  ,