Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 11:00:46
facebook Twitter Googleplus
Photo

హీరో సప్తగిరి తన పేరును ఓ బ్రాండ్ గా మార్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. కమీడియన్ గా ఓ మోస్తరు సినిమాలు చేసిన సప్తగిరి తమిళ సినిమా తిరుథన్ పోలీస్ ని రీమేక్ తెలుగులో సప్తగిరి ఎక్స్ ప్రెస్ పేరిట రీమేక్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయని ప్రచారం చేసినా అందులో నిజనిజాలు ఎవో ఎవ్వరికి తెలియని పరిస్థితి. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా సప్తగిరి ఎక్స్ ప్రెస్ కలెక్షన్స్ గురించి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు కానీ ఈ సినిమా దర్శకనిర్మాతలు చెప్పినంత రేంజ్ లో వసూళ్లు రావని అంటున్నారు.

అయితే ఈ సినిమా కలెక్షన్స్ గురించి కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం తనను హీరోగా లాంఛ్ చేసిన బ్యానర్ లో మరో సినిమా కమిటైయ్యాడు. గతంలో తిరుథన్ పోలీస్ ని రీమేక్ చేసిన సప్తగిరి ఇప్పుడు బాలీవుడ్ మూవీ జానీ ఎల్ ఎల్ బిని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి కూడా తన పేరుని జతచేసి సప్తగిరి ఎల్ ఎల్ బి అని టైటిల్ పెట్టుకున్నాడు. అయితే ఈ నేమ్ బ్రాండింగ్ ఇంతటితో ఆగలేదు సప్తగిరి ఎల్ ఎల్ బి సెట్స్ పైన ఉండాగానే సప్తగిరి సూపర్ ఫాస్ట్ అంటూ మరో సినిమాని మొదలుపెట్టేశాడు. అంటే సప్తగిరి హీరోగా మూడో సినిమా కూడా మొదలైందని సినీ జనాలు అనుకునే లోపే నాలుగో సినిమాకి కూడా శ్రీకారం చుట్టేశాడట సప్తగిరి. కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కబోతున్న ఆ సినిమాకి సప్తగిరిక దెయ్యం పట్టిందనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఛాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. అయితే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో నే హీరోగా సప్తగిరి డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డామని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేశారు.

,  ,  ,  ,  ,