Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 13:05:29
facebook Twitter Googleplus
Photo

సినీ తారలను అభిమానించడం తప్పేం కాదు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి ఇష్టాలు వారివి. ఐతే ఆ అభిమానం హద్దులు దాటితేనే కష్టం. ఈ విషయంలో తమిళ అభిమానుల అతి మామూలుగా ఉండదు. సినీ తారలకు పాలాభిషేకాలు చేయడం.. థియేటర్ల ముందు నానా అతి చేయడం వాళ్ల నుంచే మిగతా భాషల అభిమానులకూ పాకింది. ఈ అతి అభిమానం అక్కడితో ఆగకుండా తమ అభిమాన తారలకు గుడి కూడా కట్టించే వరకు వెళ్లింది. అందులోనూ హీరోయిన్లకు గుడి కట్టించడం అన్నది ఇక్కడ మరింత ఆశ్చర్యం కలిగించే విషయం.

ఖుష్బూ.. సిమ్రాన్.. నమిత.. నయనతార.. హన్సిక.. ఇలా అరవ అభిమానులు గుళ్లు కట్టించిన హీరోయిన్ల లిస్టు కొంచెం పెద్దగానే ఉంది. ఈ జాబితాలోకి కొత్తగా చేరుతున్న పేరు.. కీర్తి సురేష్. రెండేళ్ల కిందటే కథానాయికగా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి.. ప్రస్తుతం మామూలు ఊపులో లేదు. ఈ ఏడాది ఆరంభంలో శివ కార్తికేయన్ తో కలిసి ఆమె చేసిన ?రజినీ మురుగన్? బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ తర్వాత ధనుష్తో చేసిన ?తొడారి? ఆడకపోయినా.. తాజాగా శివ కార్తికేయన్ తో చేసిన మరో సినిమా ?రెమో? హిట్టయింది. ప్రస్తుతం విజయ్ లాంటి సూపర్ స్టార్ తో ?భైరవ? చేస్తోంది కీర్తి. ఇంకా ఆమె చేతిలో మరకొన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అందం - అభినయం రెండూ ఉన్న కీర్తికి అప్పుడే భారీగా అభిమానులు తయారయ్యారు. వాళ్లలో కొందరు ఆమెకు తమిళనాట గుడి కట్టించడానికి రెడీ అయిపోతున్నారు. త్వరలోనే విగ్రహ తయారీ పనులు ఆరంభం కానున్నాయి.

,  ,  ,  ,  ,