Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 12:04:01
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన అభిమానులకు అంకితమిస్తూ ?సర్దార్ గబ్బర్ సింగ్‍? అనే సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్‌తో అదరగొట్టినా, ఆ తర్వాత పూర్తిగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు కలెక్షన్స్ మెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. పూర్తిగా అభిమానులను సంతృప్తిపరచేందుకే తీసిన సినిమా కావడంతో అభిమానుల నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తూంది.
ఇక కృష్ణా ఏరియాలో వారం రోజుల్లో ఈ సినిమా 2,65,15,710 రూపాయల వసూళ్ళు సాధించింది. ఇక పశ్చిమ గోదావరిలో ఏడో రోజు 7,18,285 రూపాయల షేర్ వసూలు చేసిన సినిమా మొత్తం వారం రోజులు కలుపుకొని 3,55,48,208 రూపాయల వసూళ్ళు సాధించింది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ నిర్మించగా, పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించారు.

,  ,  ,  ,  ,  ,  ,