Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2014 11:07:17
facebook Twitter Googleplus
Photo

తెలుగు హీరోలు ప్రభాస్, రానాలు త్వరలో ఓ తమిళ సినిమాలో కనిపించనున్నారు. అదీ, సూర్యా నటించే సినిమా కావడం ఇక్కడ పెద్ద విశేషం. అసలు విషయంలోకి వెళితే, సూర్యా నటిస్తున్న 'మాస్' సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఆ పక్క ఫ్లోర్ లోనే 'బాహుబలి' సినిమా షూట్ కూడా జరిగింది. దీంతో షాట్ గ్యాప్ లో ప్రభాస్, రానా కలసి సూర్యా సెట్ ను కర్టసీ విజిట్ చేశారట. ఆ సందర్భాన్ని మాస్ దర్శకుడు వెంకట్ ప్రభు చక్కగా ఉపయోగించుకున్నాడని తెలిసింది. సూర్యాతో వీరు మాట్లాడుతున్న సందర్భాన్ని షూట్ చేయించాడు. వీరి అనుమతితో ఆ సినిమాలో ఈ సందర్భానికి ఓ సీన్ క్రియేట్ చేస్తున్నాడట. ఆ విధంగా మన హీరోలు తమిళ సినిమాలో కనిపిస్తారన్న మాట!

,  ,  ,  ,  ,