Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 17:18:40
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో నిర్మితమవుతున్న భారీ చిత్రాలు - పెద్ద హీరోల సినిమాలపై పోలీసులు గుర్రుగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ పబ్లిక్ లో నిర్వహించాలని తలపెట్టిన ఆడియో ఫంక్షన్.. చివరకు ఓ స్టార్ హోటల్ లో జరుపుకోవాల్సి వచ్చోంది.

అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ కి ప్రీమియర్ షోల విషయంలో కూడా పోలీసుల నుంచి చాలానే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అర్ధరాత్రి పూట సినిమా ప్రదర్శనలు వేయడం.. ఆ సమయంలో కూడా భారీగా అభిమానులను నియంత్రించాల్సి రావడం వంటి వ్యవహారాలు పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఇదే సమయంలో పవన్ మూవీకి అనుమతి ఇచ్చిన థియేటర్లలో.. టికెట్ రేట్లను వేల కొద్దీ వసూలు చేసి అభిమానులను నిర్వాహకులు దోపిడీ చేశారనే ఆరోపణలు గట్టిగానే వచ్చాయి. అందుకే.. ఇప్పుడు సరైనోడుకు మిడ్ నైట్ నుంచి ప్రదర్శనలు వేసేందుకు అనుమతించడం లేదు పోలీసులు.

అసలు ఈ విషయంలో ఆలోచించేందుకు కూడా కమిషనర్ ఇష్టపడ్డం లేదట. ఇప్పుడు సరైనోడుకు అర్ధరాత్రి ఆటలు కష్టమే అంటున్నారు. అయితే.. ఇదే పరిస్థితి రాబోయే చిత్రాలకు కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవంతో పాటు ఇతర భారీ చిత్రాలకు పోలీసుల నుంచి ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తమయ్యే ఛాన్స్ ఉండడంతో.. అభిమానులు ఇప్పటి నుంచే బెంగ పెట్టేసుకున్నారు.

,  ,  ,  ,  ,  ,