Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 10:43:50
facebook Twitter Googleplus
Photo

క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిశ్రమకు పరిచయమై టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారిన నటుడు సత్యదేవ్ ఇప్పటికే పలు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా తన రెండవ చిత్రాన్ని చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇప్పటికే 70 శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.
ఈ చిత్రానికి గువ్వ గోరింక అనే ఆకర్షణీయమైన టైటిల్ ఫిక్స్ చేశారు. ఆకార్ మూవీస్ పతాకంపై దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రంలో సత్యదేవ్ సరసన ప్రియాలాల్ హీరోయిన్‌ గా నటిస్తోంది. 14 ప్రేమికులరోజు సందర్బంగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నారు. ?పెళ్లి చూపులు? ఫేమ్ ప్రియదర్శి ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సురేష్ బొబ్బిలి సంగీతం, మైల్స్ రంగస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భిన్నంగా ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.

,  ,  ,  ,  ,