Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 15:49:06
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సుందరాంగి అనుష్క శెట్టిలో చాలా కళలే ఉన్నాయి. ఇప్పటికే జనాలకు చాలావరకు చూపించిన ఈ అరుంధతి.. ఇప్పుడు తన లైఫ్ లో ఎప్పుడూ చేయని కొత్త రోల్ కి కనెక్ట్ అవుతోంది. నాగార్జున్-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో సన్యాసినిగా కనిపించనుంది స్వీటీ.

నాగ్ సరసన అనుష్క అనగానే.. ఆడియన్స్ ఓ ఎక్స్ పెక్టేషన్ కి వచ్చేసే ఛాన్స్ ఉంది. గతంలో స్వీటీ చేసిన గ్లామర్ రోల్స్ చూస్తే ఇందుకు స్ట్రాంగ్ రీజన్ కూడా కనిపిస్తుంది. అయితే.. ఇప్పుడు మాత్రం అనుష్క కొత్తగా కనిపించనుందని చెబుతున్నారు. ఓం నమో వెంకటేశాయలో అనుష్క చేస్తున్నది గ్లామర్ రోల్ కాదు. ఇది ఓ సన్యాసిని పాత్ర. సన్యాసిని అంటే కాషాయం వేసేసి కూర్చోబెట్టేసే టైప్ కాకుండా.. ఆ కాలానికి సంబంధించిన పరిశోధనలు కూడా చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ మూవీలో అనుష్కను చూడగానే పాత కాలం నాటి అమ్మాయి లుక్ కచ్చితంగా కనిపిస్తుందట. గెటప్ విషయంలో అంతగా కేర్ తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ రుద్రమదేవి భక్తురాలిగా కూడా కొత్తదనం చూపించనుందనే మాట మాత్రం ఖాయం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. నాగ్ దగ్గర మాత్రం అనుష్క గ్లామర్ వేషాలు వర్కవుట్ కావట్లేదు కదూ.

,  ,  ,  ,  ,