Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jul-2017 10:47:16
facebook Twitter Googleplus
Photo

ఈమె నటించిన తొలి తెలుగు సినిమా రన్ రాజా రన్ సూపర్ హిట్ అయింది. కానీ సీరత్ కి ఇప్పుడు అనేక ఆఫర్స్ రావడానికి అసలు కారణం మాత్రం ఇది కాదు. అందాల ప్రదర్శనలో తనకు పరిధులు.. పరిమితులు లేవని ఇన్ డైరెక్టుగా చెప్పేయడమే.

ఇలా చెప్పడానికి సీరత్ కపూర్ ఎంచుకున్న రూట్ సోషల్ మీడియా. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో సీరత్ షేర్ చేసిన ఫోటోలు మామూలు సెన్సేషన్స్ క్రియేట్ చేయలేదు. టాప్ లెస్ పోజులు కూడా ఇచ్చేసి.. ఇన్ స్టా గ్రామ్ లో ఇన్ స్టంట్ గా క్రేజ్ సంపాదించేసుకుంది. అందాల ప్రదర్శన చేస్తున్న ఫోటోలను వరుసగా పోస్ట్ చేసేసి.. సెక్సీ బ్యూటీ ఇమేజ్ సాధించేసింది. అదే ఊపులో నాగార్జునతో రాజు గారి గది2.. రవితేజతో టచ్ చేసి చూడు మూవీ ఆఫర్స్ ను కూడా సొంతం చేసుకుంది సీరత్ కపూర్. ప్రస్తుతం ఈ సినిమాలు సెట్స్ పై ఉండగా.. మరికొన్ని ప్రాజెక్టులు ఈ భామ చేతిలో ఉన్నాయి.

క్షణం దర్శకుడు రవికాంత్ రూపొందిస్తున్న సినిమాలోను.. అల్లు శిరీష్- వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలోను సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇన్నేసి ఆఫర్లను తెచ్చిపెట్టిన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను... సీరత్ హఠాత్తుగా డిలీట్ చేసేసింది. దీంతో ఈమెను ఫాలో అవుతున్నవారంతా ఒక్కసారిగా షాక్ తినేశారు. సెక్సీ బ్యూటీ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందో అర్ధం కాక.. ఎంత పని చేశావ్ సీరత్ అని తెగ బాధ పడిపోతున్నారు.

,  ,  ,  ,  ,  ,