Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Oct-2017 17:03:05
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు పూరి జగన్నాథ్ ఫైనల్ గా తన కొడుకుతో సినిమాను స్టార్ట్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. గత చిత్రాలతో భారీ డిజాస్టర్స్ ని అందుకున్న పూరి ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కొన్ని కథలను వేరే హీరోలతో తీద్దామనుకున్నా కూడా అవి పక్కనపెట్టేసి ఆకాష్ తో మెహబూబా ని సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు.

1971 ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో మెహబూబా అనే ఒక లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న పూరి.. మొదటి షెడ్యూల్ నిమిత్తం చిత్ర యూనిట్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ కి బయలు దేరాడు. ఈ రోజు ఉదయం హీరో ఆకాష్ కొత్త కథానాయిక నేహా శెట్టి ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఒక ఫొటోని హీరోయిన్ ఛార్మి షేర్ చేస్తూ.. మెహబూబా మొదలవుతోంది.. మొదటి అడుగుపడింది.. అంటూ చెప్పింది. ఇద్దరు కొత్త వాళ్లు కావడంతో ముందే ఈ సినిమా వర్క్ షాప్ ని బాగా నిర్వహించాడట పూరి. ఛార్మి ఆధ్వర్యంలో నటీనటులను ఫైనల్ చేసిన పూరి.. అన్ని క్యారెక్టర్స్ ని కొత్తగా చూపించబోతున్నాడట. కొన్ని రోజుల వరకు హిమాచల్ షూట్ చేసి.. తదుపరి షెడ్యూల్ నిమిత్తం పంజాబ్ - రాజస్థాన్ కి వెళ్లనున్నారు.

సినిమా కంటెంట్ మీద ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ - టీజర్స్ తో పూరి ఆకట్టుకుంటే ఇంకా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. పూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సందీప్ చౌతా చాలా రోజుల తర్వాత పూరి సినిమాకి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన సూపర్ - బుజ్జిగాడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

,  ,  ,  ,  ,