Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Aug-2015 15:54:43
facebook Twitter Googleplus
Photo

గాల్లో ఎగిరే విమానం రెక్కల్ని పట్టుకుని సాహసోపేతమైన స్టంట్స్ చేయడం పరిగెత్తే కార్ లోంచి ఊహించని రీతిలో జంప్ చేయడం అంతెత్తు నుంచి ఓ డీప్ వాటర్ లోకి జంప్ చేసి శత్రువుల తుపాకి గుళ్ల నుంచి తప్పించుకోవడం.. ఇలాంటి సాహసాలన్నీ చూడాలంటే ఎంఐ సిరీస్ సినిమాలు చూడాల్సిందే. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ అసాధారణ విన్యాసాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఇప్పటికే ఈ సిరీస్ లో బోలెడన్ని సినిమాలొచ్చాయి. తాజాగా మిషన్ ఇంపాజిబుల్ (ఎంఐ) సిరీస్ లో రోగ్ నేషన్ సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

ఈ చిత్రంలో టామ్ క్రూజ్ ఐఎంఎఫ్ ఏజెంట్ ... ఇథాన్ హాంట్ గా నటించాడు. ఈ సినిమాకి టీజర్ నుంచే హైప్ అదిరిపోయింది. అందుకు తగ్గట్టే రిలీజైన తొలివారంలో వసూళ్ల వర్షం కురిపించింది. మిలియన్ డాలర్లు పోటెత్తాయి. ఈ సిరీస్ లోనే అతి పెద్ద రెండో విజయంగా నమోదైంది. ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ స్టార్లు దర్శకరచయితలు ఈ సినిమాని చూసి మెచ్చుకున్నారు. శ్రుతిహాసన్ మహేష్ లాంటి స్టార్లు టామ్ క్రూజ్ కి వీరాభిమానులు. శ్రీమంతుడు ప్రమోషన్ బిజీలో చూశారో లేదో కానీ... కచ్ఛితంగా వీళ్లందరికీ నచ్చే సినిమా ఇది.

,  ,  ,