Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2015 10:50:52
facebook Twitter Googleplus
Photo

తండ్రీకూతుళ్ళు కమలహాసన్, శ్రుతి హాసన్ కలసి సినిమాలో నటించడం కుదరకపోయినా, స్టేజ్ మీద మాత్రం కలసి డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఈ అరుదైన ముచ్చటకు నిన్న రాత్రి చెన్నయ్ లో జరిగిన ఓ అవార్డుల వేడుక వేదికైంది. 1990లో వచ్చిన 'మైఖేల్ మదన కామరాజ్' సినిమాలోని హిట్ సాంగ్ 'రమ్ బమ్ బమ్ ఆరంభం ...' అంటూ సాగే హిట్ సాంగుకు కమల్, శ్రుతి కలసి వేసిన స్టెప్స్ ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. దీంతో శ్రుతి తెగ ఆనందపడిపోతోంది. "డాడ్ తో కలసి రాత్రి డ్యాన్స్ చేసిన క్షణాలు నా జీవితంలో ప్రత్యేకమైన మధురక్షణాలు" అంటూ ట్వీట్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఆ సందర్భంగా ఇద్దరూ కలసి తీసుకుంటున్న సెల్ఫీ పోజును కూడా పోస్ట్ చేసింది.

,  ,  ,  ,