చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎవరూ చేయనన్ని సినిమాలు చేసింది షామిలి. అయితే హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొద్ది రోజులు సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆఫర్లను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దీంతో షామిలి అక్క షాలిని రంగంలోకి దిగింది.తన చెల్లెలి కెరీర్ కోసం తను కథలను వినడం స్టార్ట్ చేసింది. మంచి స్టోరీలను సెలక్ట్ చేసి అందులో షామిలిని నటింపజేయాలని షాలిని అనుకుంటున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షామిలి బావ అజిత్ కూడా ఆమె కెరీర్ లో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి షామిలికి ఆఫర్లు లేకపోయినా అక్కా బావల ప్రోత్సాహం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆమె సక్సెస్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉండగా తమిళ్ లో వెంకట్ ప్రభు సరసన షామిలి నటించిన ?వీర శివాజీ? విడుదలకు సిద్ధంగా ఉంది.
Shalini, Project, With, Her, Sister, Matter, Tollywood,