Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2017 15:40:13
facebook Twitter Googleplus
Photo

మా హీరో గ్రేటంటూ అభిమానులు కొట్టుకుంటారు. కానీ ఒక మల్టీస్టారర్ మూవీ ఆడియో వేడుకలో ఈ చిత్రంలో నేను హీరో అంటే నేను హీరో అని కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? శమంతకమణి ప్రి రిలీజ్ ఈవెంట్లో అదే జరిగింది. ఈ చిత్రంలో నారా రోహిత్.. సుధీర్ బాబు.. సందీప్ కిషన్.. ఆది ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వైవిధ్యంగా జరిగిన ఈ వేడుక సందర్భంగా వేదిక ఎక్కిన హీరోలందరూ ఈ చిత్రంలో నేనే హీరో అంటే నేనే హీరో అంటూ ప్రకటించుకోవడం విశేషం. దీంతో ‘శమంతకమణి’ ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా సరదాగా మారింది. ముందు ఇలా అన్నప్పటికీ ఆ తర్వాత ఈ చిత్రంలో కథే హీరో అని.. ఇలాంటి కథ రాసిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యనే అసలు హీరో అని ఈ యువ కథానాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ వేడుకలో నారా రోహిత్ మాట్లాడుతూ.. శమంతకమణి అందరం మంచి పాత్రలు చేశామని.. షూటింగ్ అంతా సరదాగా సాగిపోయిందని అన్నాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి రోహిత్ మాట్లాడుతూ.. బాలయ్యతో ఆయన సినిమా చేయాలని తాను ఎప్పట్నుంచో కోరుకుంటున్నానని.. ఎట్టకేలకు ఆ కలల కాంబినేషన్ ‘పైసా వసూల్’తో సాకారం కాంబోతోందని వ్యాఖ్యానించాడు. ఆది మాట్లాడుతూ.. నలుగురు హీరోలు ఎక్కడా ఇగోలకు పోకుండా పని చేశామని.. ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నపుడు చాలా ఎగ్జైట్ అయ్యానని తెలిపాడు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నలుగురు హీరోలు కలిసి పని చేస్తే షూటింగ్ ఎంత సరదాగా సాగుతుందో శమంతకమణి ద్వారా తనకు తెలిసిందన్నాడు. రాజేంద్ర ప్రసాద్ నుంచి తాను ఈ సినిమాతో ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఇందులో తాను తల్లిలేని అబ్బాయిగా నటించానని.. ఈ పాత్ర చేస్తున్నపుడే తన తల్లి గొప్పదనం తెలిసిందని చెప్పాడు

,  ,  ,  ,