Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 10:40:14
facebook Twitter Googleplus
Photo

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ?రోబో? చిత్రం రికార్డ్ కలెక్షన్లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా శంకర్, రజనీల కాంబినేషన్లో ?రోబో 2.0? అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ?అక్షయ్ కుమార్? నటిస్తుండగా మరో అద్భుత నటి ?రమ్య కృష్ణ? కూడా ఈ సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.
గతంలో రజనీ, రమ్యకృష్ణ కలిసి నటించిన నరసింహ చిత్రం ఘన విజయం సాధించి నటిగా రమ్యకృష్ణ స్థాయిని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ ఈ రోబో 2.0 చిత్రంతో రిపీట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఖచ్చితమైన క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్న రజనీ ఈ నెలాఖరుకు తిరిగిరాగానే రోబో 2.0 షూటింగ్ లో పాల్గొంటాడు. ప్రస్తుతం రజనీ నటించిన ?కబాలి? చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.

,  ,  ,  ,