Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2015 10:51:48
facebook Twitter Googleplus
Photo

ఇటీవల విడుదలైన 'ఐ' చిత్రంతో మరోసారి వసూళ్లలో తన సత్తా చాటుతున్న తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించే తదుపరి చిత్రం ఏమిటన్న దానిపై కోలీవుడ్ లోనే కాకుండా, టాలీవుడ్ లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అజిత్ తో ఆయన ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వీరిద్దరి మధ్యా ఇప్పటికే చర్చలు కూడా జరిగాయనీ, ప్రస్తుతం సబ్జెక్టు వర్క్ జరుగుతోందనీ అంటున్నారు. దర్శకుడు శంకర్, హీరో అజిత్... వీరిద్దరితోనూ చిత్రాలు నిర్మించి, వీరితో మంచి అనుబంధం వున్న ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తారట!

,  ,  ,  ,  ,