Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2016 12:48:55
facebook Twitter Googleplus
Photo

రానా.. రెజీనా.. అన్నీ సవ్యంగా కుదిరితే ఇప్పటికే ఈ జోడీని తెరపై చూసేవాళ్లం. ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా ఓ చిత్రం ప్రారంభమైంది. అనివార్య కారణాల వలన ఆ చిత్రం మధ్యలోనే ఆగింది. ఇన్నాళ్లకు మళ్లీ ఈ జోడీ కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో సత్యశివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా, రెజీనా జంటగా నటించనున్నారు. తమిళ చిత్రానికి ?మడై తిరందు? తెలుగుకి ?1945? అనే టైటిల్‌ని ఖరారు చేశారట. 1940లలో జరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా వివిధ గెటప్పుల్లో కనిపిస్తారట.

బాహుబలి: ది కంక్లూజన్?లో భల్లాలదేవుడి పాత్ర కోసం రానా కండలు తిరిగిన దేహంతో పాటు గడ్డం కూడా బాగా పెంచారు. 1945లో ఓ గెటప్ ఈ భల్లాలదేవుడి గెటప్ తరహాలో ఉంటుందట. ఈ నెల 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. ఏడు దశాబ్దాల క్రితం జరిగిన కథతో సినిమా కాబట్టి రానా, రెజీనా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు.

,  ,  ,  ,  ,  ,