Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 15:47:19
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమాలో విలన్‌గా నటించిన శరత్ కెల్కర్ మరోసారి పవన్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. సర్దార్ పరాజయం పాలైనా అందులో నటించిన శరత్ కెల్కర్‌కు నటుడిగా మంచి పేరే వచ్చింది. ఇక ఆ సినిమా అప్పుడే శరత్ ప్రతిభను మెచ్చిన పవన్, తన కొత్త సినిమాలోనూ విలన్‌గా అతడినే ఎంపిక చేశారట. హిందీ సీరియళ్ళతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్, సర్దార్ గబ్బర్ సింగ్‌ అవకాశం పొందడంతో ఒక్కసారే పాపులర్ అయిపోయారు.
ఇక ఇప్పుడు పవన్ కొత్త సినిమాలోనూ అవకాశం దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. కాగా ఈ విషయమై టీమ్ నుంచి ఇంకా ఓ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శరత్ మరార్‌తో కలిసి పవన్ స్వయంగా నిర్మించనున్నారు. జూలై నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమా ఓ ఫ్యాక్షనిస్టు ప్రేమకథగా తెరకెక్కనుంది

,  ,  ,  ,  ,