Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Mar-2016 13:58:00
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి సినిమాల్లో ?సోగ్గాడే చిన్నినాయనా? మాత్రమే ఇంకా థియేటర్లలో ఉంది. దాని థియేట్రికల్ రన్ ముగియడానికి ఇంకా టైం పట్టేట్లుంది. మిగతా మూడు సంక్రాంతి సినిమాల కథ ఇప్పటికే ముగిసిపోయింది. అన్నింట్లోకి ముందు ?డిక్టేటర్? జర్నీ ముగిసిపోగా.. ఆ తర్వాత ?ఎక్స్ ప్రెస్ రాజా? ?నాన్నకు ప్రేమతో? సినిమాల పరుగు ఆగింది. డిక్టేటర్ చివరికి బయ్యర్లకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నష్టాలు మిగల్చగా.. ?నాన్నకు ప్రేమతో? మీద పెట్టుబడి పెట్టిన వాళ్లు స్వల్పంగా నష్టపోయారు. ?సోగ్గాడే చిన్నినాయనా? ఇప్పటికే పెట్టుబడి మీద డబుల్ వసూళ్లతో ఇంకా తన హవా కొనసాగిస్తుండగా.. శర్వానంద్ మూవీ ?ఎక్స్ ప్రెస్ రాజా? దాని తర్వాత సెకండ్ బెస్ట్ సంక్రాంతి సినిమాగా నిలిచింది.

రూ.10 కోట్ల లోపు మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఫుల్ రన్లో రూ.13.3 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. గ్రాస్ వసూళ్లు రూ.28 కోట్లకు పైనే ఉన్నాయి. నిర్మాతలతో పాటు బయ్యర్లందర్నీ కూడా ఫుల్ ఖుషీ చేసింది ?ఎక్స్ ప్రెస్ రాజా?. సంక్రాంతికి భారీ సినిమాల పోటీని తట్టుకుని మరీ ఈ చిన్న సినిమా ఈ స్థాయిలో వసూళ్లు కురిపించడం గొప్ప విషయమే. అమెరికాలో ఈ సినిమా రూ.3 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల గ్రాస్.. రూ.11 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో రూ.4.25 కోట్లు కలెక్ట్ చేసి.. బయ్యర్ కి రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టడం విశేషం. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధర పలికే అవకాశముంది.

,  ,  ,  ,  ,