Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jun-2016 12:16:19
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ లో పవర్ ఫుల్ సీన్స్ చాలానే ఉంటాయి. కానీ రాష్ట్రానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ చెబుతూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ అందరినీ కేకలు పెట్టించేంత పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు కత్తిలాంటోడులో కూడా అలాంటి ఓ సూపర్బ్ డైలాగ్ ను పెట్టేందుకు ట్రై చేస్తున్నారు.

స్టోరీ ప్రకారం ఈ సినిమా రైతుల యాంగిల్ లో సాగుతుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న కష్టాలు.. వారికి కేటాయించిన బడ్జెట్లు.. జరిగిన ఆత్మహత్యలు.. రుణ మాఫీలు.. ఆ పేరుతో జరిగిన అక్రమాలు.. ఇలా రైతులకు సంబంధించిన ప్రతీ చిన్న డీటైల్ తో ఓ లెంగ్తీ డైలాగ్ ను పెట్టాలని డైరెక్టర్ వివి వినాయక్ డిసైడ్ అయ్యాడు. మరి ఇంత భారీ డైలాగ్ ను మెగాస్టార్ తో చెప్పించినపుడు.. ప్రతీ అంకె కరెక్ట్ గా ఉండాలి. ఒక్క ఫిగర్ తేడా వచ్చినా.. విమర్శలు చుట్టుముట్టేస్తాయి.

అందుకే కరెక్ట్ డీటైల్స్ - ఫిగర్స్ కోసం తీవ్రంగా పరిశోధన చేస్తున్నారు మూవీ యూనిట్. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి గణాంకాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ రైతుల కష్టాలకు సంబంధించి ఎక్కువగా డీటైల్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,