Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 11:13:38
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది ఆరంభంలోనే శతమానంభవతి చిత్రంతో కెరీర్లోనే అతిపెద్ద హిట్టందుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. దీంతో ఆయన తన తరువాతి సినిమాల్ని కూడా వేగవంతం చేసి వేసవి బరిలో స్టార్ హీరోల భారీ చిత్రాలతో పోటీ పడేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం అయన నూతన దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర టాకీ పార్టీ తాజాగా ముగింసింది. ఇక మిగిలిన పాటలు షూటింగును కూడా ఈ నెలాఖరుకు ముగిస్తారట.
తర్వాత వచ్చే మార్చి నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వేసవిలో సినిమాను రిలీజ్ చేస్తారట దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మంచి కథతో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ వేసవికి పవన్ కాటమరాయుడు, ఏప్రిల్ లో బాహుబలి చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,