Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 12:10:17
facebook Twitter Googleplus
Photo

బహుశా శ్రీను వైట్ల తన తొలి సినిమా నీకోసం టైంలోనూ ఇప్పుడున్నంత ఉత్కంఠగా ఉండి ఉండడేమో. మిస్టర్ అతడికి అంతటి కఠిన పరీక్ష కాబోతోంది. ఆగడు బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ల తర్వాత అతను తనేంటో రుజువు చేసుకుని తీరాల్సిన పరిస్థితి. ఈ సినిమా సక్సెస్ కావడం అతడి కెరీర్కు చాలా చాలా కీలకం. ఈ సినిమా తేడా కొడితే వైట్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. మరోవైపు హీరో వరుణ్ తేజ్ కు కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం. ఇలాంటి టైంలో ఓ తమిళ డబ్బింగ్ సినిమా మిస్టర్ టీంలో కొంచెం గుబులు రేపుతోంది. అదే.. శివలింగ.

నిజానికి లారెన్స్ నటించిన కాంచన.. గంగ తరహాలో ‘శివలింగ’పై పెద్దగా అంచనాలేమీ లేవు. ఈ సినిమాకు అంతగా పబ్లిసిటీ కూడా చేయలేదు. ఉన్నట్లుండి సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. ఐతే లారెన్స్కు మాస్ ఆడియన్స్లో ఉన్న ఫాలోయింగ్ను తక్కువగా అంచనా వేయలేం. అందుకు కాంచన గంగ సినిమాలు సాధించిన విజయాలే నిదర్శనం. శివలింగ కు ప్రచారం తక్కువగా ఉన్నప్పటికీ మాస్ సెంటర్లలో ఆటోమేటిగ్గా జనాలు థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిగ్గా బి సి సెంటర్లలో వసూళ్లు బావుంటాయి. ఆ ఏరియాల్లో మిస్టర్ కు గట్టి పోటీ తప్పదు. ఎంతైనా మిస్టర్ క్లాస్ సినిమాలాగే కనిపిస్తోంది. వరుణ్కు మాస్లో పెద్దగా ఫాలోయింగ్ లేదు.

,  ,  ,  ,  ,  ,