Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 10:31:26
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 సాధించిన విజయం అసాధారణమైనది. ఇప్పట్లో దీన్ని అందుకునే ప్రయత్నం మరొకరు చేయడానికి పది సార్లు ఆలోచింప చేసేది. ఇంతటి విజయం సాధించిన బాహుబలి దర్శక నిర్మాతలు.. ప్రస్తుతం లండన్ లో తమ తమ కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్ కోసం శక్తియుక్తులను కేటాయించిన ఈ టీం.. ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారు.

అయితే.. బాహుబలి2 వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిందనే మాట తానూ వింటున్నా.. అవి ఎలా కనిపిస్తాయో తనకు తెలీదంటున్నాడు నిర్మాత శోభు యార్లగడ్డ. ప్రస్తుతం లాభాల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని.. జనాలు ఇంతగా తమ చిత్రాన్ని రిసీవ్ చేసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నాడు. ఇంతటి ఆదరణ తాము ఊహించలేదన్న ఆయన.. నిర్మాతగా తర్వాత సినిమాపై ఇంత పెద్ద సినిమా చేయాలనే ఆలోచన సరికాదని చెప్పడం విశేషం. తామే కాదు.. ఎవరైనా సరే వెంటనే బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయాలని అనుకోవడం హాస్యాస్పదమే అన్నది ఈయన వాదన.

ఇన్ని చెప్పిన ఈయన.. బాహుబలి3పై కూడా మాట్లాడ్డమే అసలైన విషయం. ఇప్పటివరకూ బాహుబలి3 విషయంలో ఎలాంటి ప్లానింగ్ జరగలేదు.

,  ,  ,  ,  ,