Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2017 10:45:12
facebook Twitter Googleplus
Photo

బాహుబలి లో శివగామి పాత్రకు ముందు శ్రీదేవిని అడిగిన సంగతి అందరికీ తెలిసిందే. స్వయంగా రాజమౌళే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐతే సినిమాలో మిగతా పాత్రల గురించి కూడా ఇప్పుడు ఇలాంటి ప్రచారాలే సాగుతున్నాయి. బాహుబలి పాత్రకు ముందు హృతిక్ రోషన్ ను సంప్రదించారని.. అతను నో అన్నాకే ప్రభాస్ లైన్లోకి వచ్చాడని మీడియాలో ప్రచారాలు సాగుతున్నాయి. దీనిపై బాహుబలి నిర్మాతల్లో ఒకడైన శోభు యార్లగడ్డ స్పందించాడు. బాహుబలి పాత్ర ప్రభాస్ కోసమే పుట్టిందని.. అతణ్ని దృష్టిలో ఉంచుకునే ఈ పాత్రను రాశారని.. ఆ పాత్రలో ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని శోభు స్పష్టం చేశాడు.

బాహుబలి పాత్ర కోసం తాము ప్రభాస్ ను కాకుండా ఇంకెవరినీ సంప్రదించలేదని.. ఇలా అని వస్తున్న వార్తలు అబద్ధమని శోభు తెలిపాడు. బాహుబలి సినిమాను బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ ‘షోలే’తో పోల్చడంపై శోభు స్పందిస్తూ.. దర్శకుల దార్శనికత.. సాహసం కారణంగానే ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయన్నాడు. ప్రస్తుతానికి బాహుబలి-3 గురించి తాము ఏమీ ఆలోచించడం లేదని శోభు చెప్పాడు. ఐతే ‘బాహుబలి’ ప్రపంచం ఇంతటితో ముగిసిపోదని.. యానిమేషన్.. టీవీ.. మొబైల్ గేమింగ్ లాంటి మాధ్యమాల ద్వారా బాహుబలి సిరీస్ కొనసాగుతుందని అన్నాడు. బాహుబలి: ది బిగినింగ్ కంటే ది కంక్లూజన్ బాగుంటుందని తమ యూనిట్ విడుదలకు ముందు నమ్మకంతో ఉందని.. రెండో భాగంలో ఎమోషన్లు బాగా పండాయని శోభు తెలిపాడు.

,  ,  ,  ,  ,