Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2016 11:27:02
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లో వరుసగా బోలెడన్ని హిట్స్ ఉన్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. తను అరంగేట్రం చేసిన తర్వాత చేసిన రెండో సినిమా 'లవ్ కా ది ఎండ్.' 2013 లో వచ్చిన ఈ మూవీ తర్వాత శ్రద్ధా కపూర్ కి అసలు ఫ్లాప్ అన్నదే ఎదురు కాలేదు. వరుసగా తను చేసిన సినిమాలు అన్నిటితోనూ హిట్స్ సాధిస్తూ.. నాలుగేళ్లుగా ఓటమి ఎరుగని హీరోయిన్ గా రికార్డ్ కంటిన్యూ చేస్తోంది.

శ్రద్ధాకపూర్ జడ్జిమెంటల్ స్కిల్స్ కి ఈ రికార్డే ఉదాహరణ అంటారు బాలీవుడ్ జనాలు. ఆషికి2 తో మొదలైన శ్రద్ధ విజయ విహారం.. గోరి తేరి ప్యార్ మే.. ఏక్ విలన్.. హైడర్.. ఉంగ్లీ.. ఏబీసీడీ2.. బాఘీ వరకూ కంటిన్యూ అయింది. వీటిలో ఒకట్రెండ్ సినిమాలకు రివ్యూలు తేడా వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం కుమ్మేశాయి. కానీ ఇప్పుడు రాక్ఆన్2 ఈ రికార్డును బ్రేక్ చేసేసింది. మొదటి రోజు కేవలం 2.02 కోట్ల కలెక్షన్స్ రాగా.. రెండో రోజు 2.41 కోట్లు.. మూడో రోజు ఆదివారం నాడు 2.58 కోట్లు మాత్రమే వచ్చాయి.

రాక్ఆన్ లాంటి క్రేజీ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీకి తొలి వీకెండ్ లో 7 కోట్ల వసూళ్లు అంటే అది.. భారీ ఫ్లాప్ కింద లెక్క. పెద్ద నొట్ల రద్దు ఒకవైపు భారీగా ప్రభావం చూపిస్తే.. సినిమాలో కంటెంట్ పై వచ్చిన టాక్.. మిగతా పని పూర్తి చేసింది. రాబోయే రోజుల్లో మరింతగా రాక్ ఆన్2 ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

,  ,  ,  ,  ,