Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2017 13:01:05
facebook Twitter Googleplus
Photo

తల్లిదండ్రుల్లో ఎవరైనా పాపులర్ నటులైతే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అతి తేలికగా ఫేమస్ అయిపోవచ్చు. స్టార్ కిడ్ అనే గుర్తింపు ఈజీగా మనలను స్టార్ చేసేస్తుంది అనే మాట కామన్ గా వినిపించేదే. కానీ ఆ మాట తప్పంటోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్. బాలీవుడ్ లో ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తే అయినా తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందంటోంది.

‘‘నా చిన్పప్పుడు మా నాన్నను యాక్టర్ కావాలని అనుకున్నా. ఈ ప్రొఫెషన్ పై ఇష్టం పెంచుకున్నా. మా నాన్న పెద్ద యాక్టర్ కాబట్టి సినిమా ఆడిషన్స్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అవకాశాలొచ్చాయని చాలామంది అనుకుంటారు. కానీ నేను చాలా ఆడిషన్స్ కు వెళ్లా. ప్రతిసారీ నేను సెలక్ట్ అవుతాననే అనుకునే దాన్ని. కాని వాళ్లు వేరేవారిని సెలక్ట్ చేసేవారు. అలా నా ప్రయత్నాలు ఆపకుండా చేస్తూనే ఉన్నా. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాకే నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. మొదటి రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో నేను కోరుకున్న గుర్తింపు రాలేదు. చివరకు ఆషికి-2 నా కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది.’’ అంటూ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా రాణించడం వెనుక తాను పడిన స్ట్రగుల్ ఏంటో చెబుతోంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహోతో శ్రద్ధ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. డైరెక్టర్ కోరితే ఈ సినిమాలో తెలుగు వెర్షన్ లో్నూ సొంతంగా డైలాగులు చెబుతునానని కాన్ఫిడెంట్ గా చెబుతోంది సొగసరి భామ. దీంతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ లోనూ శ్రద్ధాయే హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,