Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 12:38:57
facebook Twitter Googleplus
Photo

మొదటి సారి ప్రభాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టడానికి సాహో ద్వారా మరో ప్రయత్నం చేయబోతున్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా నిర్మాతలు కూడా తెలుగు సినిమా హీరో స్థాయిని పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అగ్ర నటీనటులతో క్యారెక్టర్స్ అన్నిటిని దర్శకుడు సుజిత్ ఫిక్స్ చేసుకున్నాడు. ఏ మాత్రం తొందరపడకుండా సెట్ ని జాగ్రత్తగా తన అధీనంలో ఉంచుకుంటున్నాడట ఈ దర్శకుడు.

అయితే ప్రస్తుతం సాహో కథానాయిక పాత్ర గురించి ఒక మంచి విషయం తెలిసింది. గత కొంత కాలంగా హీరోయిన్ శ్రద్దా కపూర్ సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తోందని వార్తలు వెలువడ్డాయి. రోజుకు అనేక గాసిప్స్ వచ్చినా ఈ విషయంలో మాత్రం కాస్త ఎక్కువనే వచ్చాయని చెప్పాలి. దీంతో విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ వెంటనే రూమర్స్ పై స్పందించింది. ఆమె చేస్తోంది డ్యూయెల్ రోల్ కాదు గాని పాత్ర మాత్రం రెండు విభిన్న కోణాల్లో ఉంటుందట. క్యారెక్టర్ లో ఉండే రెండు షేడ్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఒక సైడ్ రాయలసీమ లో ఉండే సాంప్రదాయ అమ్మాయిలాగా మరొక సైడ్ గ్లామర్ డోస్ ని కాస్త తగిలించి స్టంట్స్ చేసే భామలాగా అందర్నీ అలరించనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అలాగే శ్రద్దా స్టంట్ గర్ల్ పాత్ర కోసం హాలీవుడు స్టంట్ మాస్టర్ కెన్నీ బాట్స్ వద్ద ట్రైనింగ్ కూడా తీసుకుంటోందని తెలిపారు.ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

,  ,  ,  ,  ,