Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 10:38:08
facebook Twitter Googleplus
Photo

నిర్మలా కాన్వెంట్ మూవీపై చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ ఎదిగిన శ్రియా శర్మ చాలానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే గాయకుడు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ని పలకరించిన ఈ భామ.. దీనికి పదేళ్ల ముంతే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జై చిరంజీవలో మెగాస్టార్ చిరంజీవి మేనకోడలిగా నటించిన ఈమె.. ఆ తర్వాత బాలనటిగా నాలుగైదు భాషల్లో బోలెడు సినిమాలు చేసేసింది. రజినీకాంత్ మూవీ రోబోలో.. చివరగా చిట్టి మాట్లాడేది ఈమెతోనే.

అప్పుడు చిరంజీవి మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి పరిచయం అయితే.. ఇప్పుడు నాగార్జున మూవీతో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. 'నాగార్జున గారితో సినిమాలో నాకు సీన్స్ లేకపోయినా.. ప్రోమో సాంగ్ చేశాం. అలాంటి లెజెండ్ తో కలిసి నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. కొత్త కొత్త భాష సాంగ్ సూపర్ గా వచ్చింది. ఆయన దగ్గర నుంచి చాలాచాలా నేర్చుకున్నా' అని చెప్పింది శ్రియా శర్మ.

హీరోగా నటించిన రోషన్ కు మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడన్న శ్రియా శర్మ.. ప్రతీ సన్నివేశం చిత్రీకరించేందుకు ముందు ఇద్దరం డిస్కసన్ చేసుకునేవాళ్లం అని చెప్పింది. దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించాడని.. సెప్టెంబర్ 16న విడుదల కానున్న ఈ మూవీ.. ఆడియన్స్ కు కొత్తగా ఉండడం ఖాయమన్న శ్రియా శర్మ.. నిర్మలా కాన్వెంట్ విడుదలయ్యాకే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో డెసిషన్ తీసుకుంటానంటోంది.

,  ,  ,  ,  ,