Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Oct-2017 15:04:57
facebook Twitter Googleplus
Photo

సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇతర ఇండుస్త్రీలలో కూడా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. విక్రమ్ తనయుడు ధృవ హీరోగా విలక్షణ దర్శకుడు బాల తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. బాల దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

హీరోయిన్ విషయానికి వస్తే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రియ శర్మ హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ జై చిరంజీవా సినిమాలో మేనకోడలిగా ఆకట్టుకున్న ఆమె దూకుడులో సమంత చెల్లెలుగా నటించింది. అంతే కాకుండా నిర్మల కాన్వెంట్ - గాయకుడు సినిమాల్లో యువ హీరోయిన్ గా అలరించింది. ఇప్పుడు మరోసారి అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే అర్జున్ రెడ్డి సినిమా ఏ తరహాలో ఉంటుందో తెలిసిన విషయమే కానీ శ్రియ కొన్ని సీన్లలో హాటుగా కనిపించగలదా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా అందులోను దర్శకుడు బాల. అసలే ఆయన చాలా మొండి ఘటం.. సీన్స్ ఆయన ఊహించే విధంగా వచ్చే వరకు చుక్కలు చూపిస్తారు.

,  ,  ,  ,  ,  ,