Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 11:46:30
facebook Twitter Googleplus
Photo

సౌత్ బ్యూటీ శృతి హాసన్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటేస్తోంది. ఆ వుడ్డు.. ఈ వుడ్డు అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ సినిమాలు ఉండేలా జాగ్రత్త పడుతూ.. బ్యాలెన్సింగ్ గా ఉంది కమల్ హాసన్ డాటర్. మరి కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ తో ఈ వయ్యారి నటించిన కాటమరాయుడు రిలీజ్ కానుంది.

తాజాగా కాటమరాయుడు మూవీలోంచి అర్మాన్ మాలిక్.. శ్రేయా ఘోషల్.. పాడిన ఏమో ఏమో ఏంటో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో కనిపించే స్టిల్స్ ను కూడా విడుదల చేసింది యూనిట్. ఫారిన్ లొకేషన్స్ లో రూపొందించిన ఈ ఫాస్ట్ బీట్ మెలోడీ.. సూపర్బ్ గా ఆకట్టుకోగా.. విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. అయితే.. కొన్ని స్టిల్స్ లో.. ముఖ్యంగా ఫ్రంట్ యాంగిల్ నుంచి తీసిన షాట్స్ లో శృతి హాసన్ ను చూస్తే.. కొంచెం ఒళ్లు చేసిందే అనిపించడంలో సందేహం లేదు. అలాగని మరీ బొద్దుగా ఏమీ మారిపోలేదు కానీ.. అమ్మడు బాడీపై కాసింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఈ 30 వసంతాల సుందరికి.. బ్యూటీపై జాగ్రత్తలు ఎక్కువే కానీ.. ఈ మధ్య కాసింత మనసు పెట్టడం మానేసినట్లుంది. అఫ్ కోర్స్.. ఈమె తలచుకుంటే.. అదేమీ పెద్ద విషయం కాదులే.

,  ,  ,  ,  ,  ,