Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Aug-2015 16:05:58
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతోంది శ్రుతిహాసన్. తెలుగు తమిళ్ హిందీ పరిశ్రమల్లో క్షణం తీరిక లేకుండా నటించేస్తోంది. ఇంత బిజీలోనూ భవిష్యత్ కి సంబంధించిన తెలివైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికిప్పుడు సంగీతంలో ప్రజ్ఞ ఉన్నవారికి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. మ్యూజిక్ రిలేటెడ్ ఆల్బమ్స్ ని రూపొందించి ప్రపంచ పాప్ సామ్రాజ్యంలో తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. అందుకు ఇప్పటికే పలు రాక్ బ్యాండ్ లతో తనకి ఉన్న కాంటాక్ట్స్ ని ఉపయోగించబోతోంది. అంతేకాదు పనిలో పనిగా ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడానికి ప్రణాళికలు వేస్తోంది.

అలాగే ఓ బ్యానర్ స్థాపించి మ్యూజిక్ ఆల్బమ్స్ లఘుచిత్రాల్ని నిర్మించాలని సంకల్పించిందని ఇదివరకే చెప్పుకున్నాం. ప్రతిభావంతులు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇందులో లఘుచిత్రాలకు దర్శకత్వం వహించవచ్చు. శ్రుతి పెట్టుబడులు పెడుతుంది. ఓ చక్కని కాన్సెప్టు ఎంచుకుని ముందుకు సాగడమే ముఖ్యం. అలాగే వీటన్నిటికీ సంబంధించిన అప్ డేట్స్ ని ఓ యూట్యూబ్ చానెల్ లో ప్రచారం చేసేందుకు ఉద్యుక్తం అవుతోంది. అందుకే మీ దగ్గర దమ్ముంటే నా దగ్గరికి రండి అంటూ లఘుచిత్రాలు తీసేవాళ్లకు సంగీతజ్ఞులకు సవాల్ విసిరింది. నిజంగానే మీ దగ్గర విషయం ఉంటే శ్రుతి ఛాలెంజ్ ని స్వీకరించేందుకు ముందుకు రండి మరి.

,  ,