ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ప్రచారమే కీలకం. సినిమా జనాల్లోకి వెళ్లాలంటే విడుదలకు ముందు ప్రచారంతో హోరెత్తించాల్సిందే. అయితే ?నాయకి? తీరు ఇందుకు భిన్నంగా వుంది. త్రిష కథానాయికగా నటించిన చిత్రమిది. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఎలాంటి సడీచప్పుడు లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెగిటివ్ టాక్ వచ్చింది లెండి. అది వేరే సంగతి. అసలు ఈ సినిమాలో ప్రమోషన్ లో త్రిష కనించనే లేదు. దీనికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే .. అసలు సంగతి తెలిసింది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ గా అనుకున్న మొత్తంలో 50% బ్యాలెన్స్ పెండింగ్ పెట్టేశారట. బ్యాలెన్స్ పేమెంట్ సినిమా పూర్తయ్యాక ఇచ్చేట్లు చెప్పిన నిర్మాత.. చివరికి బిజినెస్ సరిగా జరగలేదని.. నష్టాల పాలయ్యానని చెప్పి త్రిషకు హ్యాండిచ్చేశాడట. దింతో సినిమాని లైట్ తీసుకుందట త్రిష.
Trisha, Says, no, Nayaki, Movie, Promotions, Matter, Tollywood,