Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2016 12:43:29
facebook Twitter Googleplus
Photo

సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ) దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నింటిని ఒక తాటిపైకి తీసుకొచ్చి సందడి చేయిస్తుంటుంది. 2012లో మొదటిసారిగా ఈ అవార్డ్స్ మొదలయ్యాయి. గత సంవత్సరం దుబాయ్ లో జరిగిన ఈ కార్యక్రమం ఈ సారి సింగపూర్ లోని సన్ టెక్ కన్వెన్షన్ సెంటర్ లో జూన్ 30, జూలై 1 న ఈ కార్యక్రమం అంగరంగవైభవంగా జరుగనుంది. వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినిమాలకు సంబంధించిన స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు.
ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ రోజు శృతిహాసన్, రానా దగ్గుబాటి, అనిరుధ్ రవిచందర్ తో పాటు సైమా చైర్ పర్సన్ బ్రిందా ప్రసాద్ పాల్గోన్నారు. టాలీవుడ్ (తెలుగు), కోలీవుడ్ (తమిళ్), శాండల్ వుడ్ (కన్నడ), మోలీవుడ్ (మళయాలం) సినీపరిశ్రమల నుంచి దాదాపు వందమంది సెలబ్రీటీస్ ఈ సంబరాలకు హాజరుకానున్నారు. అలాగే ఈ నాలుగు భాషల సినిమాలకు సంబంధించి వివిధ క్యాటగిరీల్లో అవార్డుల ప్రధానంతో పాటు, నటీనటుల డ్యాన్స్ పొగ్రామ్స్ ఉంటాయి. ఇక ఈ అవార్డు వేడుకను తిలకించాలంటే బుల్లి తెరపై ప్రసారం చేసేదాకా మనం వేచి చూడాల్సిందే!

,  ,  ,  ,  ,  ,  ,