Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jul-2016 12:21:58
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: సూర్య నటించిన సింగం, సింగం 2 సినిమాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూడో చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎప్పటిలాగే ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ కాగా....మరో హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వైజాగ్‌లో మొదలైంది. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరుగబోతోంది. వాస్తవానికి గతేడాది డిసెంబర్లోనే వైజాగ్ లో షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా పలు కారణాలతో ఆలస్యం అయింది. వైజాగ్ బీచ్ రోడ్డులో 'సింగం-3' సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగింది. పోలీసు వాహనాల్లో సూర్య, మరికొందరు ఆర్టిస్టులు దిగి హడావుడి చేయడం చూసి అక్కడ ఉన్న ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. అయితే అయితే అది షూటింగ్ అని తెలియడంతో చిత్రీకరణ పూర్తయ్యే వరకు షూటింగ్ చూస్తూ అక్కడే ఉండి పోయారు. ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ముందే షూటింగ్ అని తెలిస్తే జనం బాగా పోగవుతారనే ఉద్దేశ్యంతో....సైలెంటుగా వచ్చి సీన్ పూర్తి చేసారు. ఈ సందర్భంగా లోకల్ పోలీసులు బందోబస్తు కల్పించారు.

,  ,  ,  ,  ,  ,  ,