Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Feb-2017 12:23:54
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల్లో జాయిన్ అయిపోయి చాలాకాలమే అయింది. ఇటు తెలుగులోనే కాకుండా.. మలయాళంలో కూడా సూపర్ మార్కెట్ ఉన్న తెలుగు హీరో స్టైలిష్ స్టార్. ఇప్పుడు బన్నీ తమ్ముడు కూడా మల్లూవుడ్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.

శ్రీరస్తు శుభమస్తుతో హిట్ అందుకున్న అల్లు శిరీష్.. ఆ తర్వాత మలయాళ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 1971 ఇండియా-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే 1971: బెయాండ్ బోర్డర్స్ అనే మూవీలో మోహన్ లాల్ హీరోగా నటించగా.. కీలకమైన పాత్రలో అల్లు శిరీష్ నటించాడు. ఇప్పుడీ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న అల్లు శిరీష్ మల్లూవుడ్ లాంఛింగ్ మూవీని రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమాలో యుద్ధ ట్యాంకర్ ఆపరేటర్ గా అల్లు శిరీష్ కనిపించబోతున్నాడు.

మలయాళ పరిశ్రమలో విపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ తమ్ముడిగా ఇంట్రడ్యూస్ అవుతుండడంతో.. శిరీష్ ఎంట్రీపై అక్కడ మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న మోహన్ లాల్ మూవీతో లాంఛ్ అవుతుండడంతో.. మల్లూవుడ్ లో శిరీష్ ఎంట్రీ గ్రాండ్ గానే మొదలయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంనచా వేస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,