Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 16:14:39
facebook Twitter Googleplus
Photo

వైద్యుడు అంటే మామూలు వైద్యుడు కాదండోయ్. ఏకంగా భూత వైద్యుడు. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు అదే పని చేస్తున్నారులే. హారర్ సినిమాల్లో భూత వైద్యులు అంటే భలే కామెడీ కదూ.. అందుకే ఇప్పుడు అల్లరి నరేష్ కూడా అదే రూటులో వెళ్తున్నాడు.

''ఇంట్లో దెయ్యం.. నాకేంటి భయ్యం'' అనే సినిమాతో వస్తున్నాడు నరేష్. నాగేశ్వరరెడ్డి రూపొందించిన ఈ సినిమాలో మనోడు ఒక దొంగ వైద్యుడిగా ఒక మహల్ లో అడుగుపెడతాడు. అయితే జనాలు దెయ్యాలు ఉన్నాయని భ్రమ పడతారు కాబట్టి.. అది క్యాష్ చేసుకోవాలని చూస్తుంటాడు. కాకపోతే అక్కడికి నిజంగానే దెయ్యం వస్తుంది. ఈ మధ్యన వచ్చిన ''గీతాంజలి'' సినిమాలో బ్రహ్మానందం కూడా ఇలాంటి పాత్రనే చేశాడు. మరి టీజర్ చూస్తే పెద్ద కిక్కేం లేదు కాని.. సినిమాలో అల్లరి నరేష్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

మొన్నామధ్యన వచ్చిన సెల్ఫీ రాజా కూడా ఫ్లాపయ్యాక.. ఇప్పుడు నరేష్ కు ఈ బూత వైద్యుడే దిక్కు. బూతాలను పోగొడుతూ.. తనకు పట్టిన ఫ్లాప్ బూతాన్ని కూడా వదలించుకుంటాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,