Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jul-2017 11:04:46
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ చిత్రం కోసం మహేష్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాల షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసింది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఆ షూటింగ్ సెట్లోకి ఓ అనుకోని అతిథి వచ్చి సందడి చేసింది.

ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్నఆ సూపర్ స్టార్ సినిమా సెట్లో మరో స్టార్ (సితార) వచ్చి హల్ చల్ చేసింది. ప్రిన్స్ మహేష్ ముద్దుల కూతురు సితార ఆ సెట్లోకి వచ్చి సందడి చేసింది. మహేష్ ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. అందుకే వీలు చిక్కినప్పడల్లా పిల్లలను సెట్ కు తీసుకెళుతుంటాడు.

సితార ఈ విధఃగా సెట్ లో సందడి చేయడం ఇది రెండో సారి. శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలోనూ సితార సెట్ లో సందడి చేసింది. తాజాగా స్పైడర్ సెట్ లో సితార ఫొటోలను చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

,  ,  ,  ,  ,