Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2016 12:14:23
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమా ఫ్లాపైందంటే.. ఖచ్చితంగా కొందరు దర్శకులకు మాత్రం తదుపరి ప్రాజెక్టును ఓకె చేయించుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. అయితే హిట్టు కొట్టాక కూడా శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకుడికి సీతమ్మ వాకిట్లో తరువాత ముకుంద సినిమా చేయడానికి చాలా టైమే పట్టేసింది. ఇప్పుడిక బ్రహ్మోత్సవం వంటి డిజాష్టర్ చేతిలో పెట్టాక.. మరి ఏ హీరో డేట్లు ఇస్తాడు వెంటనే??

తాజాగా మనకు వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. సరైన కథతో వస్తే.. వెంటనే సినిమా చేసేద్దాం అంటున్నారట మెగా హీరోలు. అందులో రామ్ చరణ్ ఒక వ్యక్తి అయితే.. మరోవైపు సాయిధరమ్ కూడా నాక్కూడ ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టయినర్ ఉంటే చూడన్నా అని చెప్పాడట. దానితో తన దగ్గరున్న రెండు లైన్లలో ఒకటి పూర్తి స్థాయిలో రెడీ చేసి.. ఈసారి బడ్జెట్ మితిమీరకుండా చాలా జాగ్రత్తగా ప్రొడక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసి వర్కు చేస్తాడట అడ్డాల. ''ముకుంద'' వంటి డిజాష్టర్ తో మెగా క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చినా కూడా.. మనోడికి మళ్లీ వాళ్లు సినిమా ఇస్తాం అన్నారంటే గ్రేటే బాసూ.

ఇకపోతే ఈసారైన అనవసరమైన స్టార్ క్యాస్టింగ్.. లెక్కలేనన్నీ షూటింగ్ డేస్.. అక్కర్లేని సెట్లు.. అర్ధంలేని సీన్లు తీయకుండా చక్కగా ఓ మాంచి సినిమా తీస్తాడని ఆశిద్దాం.

,  ,  ,  ,  ,  ,  ,