Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Mar-2017 11:28:42
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడు చిత్రం కోసం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్న కాటమరాయుడులో.. పవన్ కు నలుగురు తమ్ముళ్లు ఉంటారనే విషయం తెలిసిందే. అయితే.. ఒక తమ్ముడిగా శివరాయుడి పాత్రను పోషించిన శివబాలాజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు.

గతంలో మంచి పాత్రలతో ఆకట్టుకున్న శివబాలాజీ.. ఆ తర్వాత రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ రావడంతో.. తిరిగి పికప్ అయ్యేందుకు అవకాశం లభించింది. ఆ ఉత్సాహం శివబాలాజీలో కూడా కనిపిస్తోంది. కాటమరాయుడు గురించి అప్ డేట్స్ ఇస్తూ ఆసక్తి కలిగించాడు. అయితే.. ట్రాలింగ్స్ పై ఈ పవన్ తమ్ముడు రియాక్ట్ అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాటమరాయుడికి డబ్బింగ్ చెబుతూ అప్డేట్ ఇవ్వడం.. ఓ వ్యక్తి శివబాలాజీని తిట్టడం.. ఇతను సైబర్ క్రైమ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శివబాలాజీ ఆవేశంగా మాట్లాడితే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అతని పేరు మర్చిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో శివబాలాజీపై ట్రాలింగ్ పెరిగింది.

,  ,  ,  ,  ,  ,