Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2014 08:08:43
facebook Twitter Googleplus
Photo

మన టాలీవుడ్ తారలు న్యూ ఇయర్ వేడుకలకు తలో ప్రదేశానికి వెళ్లిపోతున్నారు. పెళ్లికాని వాళ్లు స్నేహితులతో వెళుతుంటే... పెళ్లయిన వాళ్లు ఫ్యామిలీలతో వెళుతున్నారు. ఈ క్రమంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌతాఫ్రికాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు ప్లాన్ చేసుకున్నాడు. అందుకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ నుంచి కొంచం బ్రేక్ తీసుకున్నాడు. భార్య స్నేహ, తనయుడు అయాన్ లను తీసుకుని దక్షిణాఫ్రికాకు బయలుదేరుతున్నాడు. తిరిగి జనవరి రెండో వారంలో హైదరాబాదుకి వస్తాడని బన్నీ సన్నిహితులు చెబుతున్నారు. తనయుడు అయాన్ తో కలసి బన్నీకి ఇదే తొలి విదేశీయానం అవుతుంది!

,  ,  ,  ,  ,