Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2017 15:03:13
facebook Twitter Googleplus
Photo

హీరోలు మల్టి స్టారర్ సినిమాలు అంతగా చేయకున్నా చిన్న హీరోలు మాత్రం భయపడకుండా ఆ ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర హీరోలు మల్టి స్టారర్ సినిమాలను బాగానే చేస్తున్నారు. 2007 లో వచ్చిన చందమామ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కృష్ణవంశీ ఆ సినిమాను తెరకెక్కించాడు. అందులో నటించిన వారికి కూడా ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి.

నవదీప్ - శివ బాలాజీ ఆ తర్వాత చాలా బిజీ అయిపోయారు. ఇక హీరోయిన్ కాజల్ అయితే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పటికి స్టార్ హోదానే కొనసాగిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఆ సినిమా హీరోలు శివ బాలాజీ - నవదీప్ మళ్లీ మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. శివ బాలాజీ బిగ్ బాస్ షో విన్నర్ అవ్వడంతో ప్రస్తుతం అతనికి చాలా ఇమేజ్ వచ్చింది. నవదీప్ కూడా బిగ్ బాస్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి వీళ్ళు బిగ్ బాస్ స్టార్లుగా బాగానే ఫేం ఎంజాయ్ చేస్తున్నారులే.

అయితే ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ రీసెంట్ గా వీరిద్దరికి సరిపడే కథని సెట్ చేసిందట. ఈ మధ్యనే ఒక కొత్త దర్శకుడు ఈ యాక్టర్లకు కథ చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం శివ బాలాజీ ఒక సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,