Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2017 11:39:38
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ మూవీస్ తో సినిమాల్లోకి వచ్చినా.. స్నేహా ఉల్లాల్ కి టాలీవుడ్ లో మంచి ఫేమ్ లభించింది. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత సింహ లాంటి బ్లాక్ బస్టర్ లో కూడా నటించింది. తెలుగులో చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్.. మూడేళ్లుగా సినిమాలకు దూరమైపోయింది.

ఇందుకు తనకు గల ఒక వ్యాధి కారణం అని చెప్పింది స్నేహా ఉల్లాల్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు బ్రేక్ తీసుకోవాలని తాను అనుకోలేదని.. అయితే తన వ్యాధి కారణంగా ఇలా గ్యాప్ ఇవ్వక తప్పలేదని చెప్పింది స్నేహా ఉల్లాల్. రక్తానికి సంబంధించిన ఒక వ్యాధితో బాధ పడ్డాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా నేను మరీ బలహీనంగా మారిపోయాను. నా అంతట నేను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేకపోయేదాన్ని. దీంతో 2014 వరకు నాకు ఉన్న కమిట్మెట్స్ ను పూర్తి చేసేసి గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు అని చెప్పింది స్నేహా ఉల్లాల్.

సినిమాలు ఆపేసి చికిత్స తీసుకున్న స్నేహా ఉల్లాల్.. శారీరకంగా మళ్లీ ఫిట్నెస్ సంపాదించుకున్నానని చెప్పింది.

,  ,  ,  ,  ,