Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 09:56:04
facebook Twitter Googleplus
Photo

ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నిరీక్షణ ఫలించింది. మహేష్ కొత్త సినిమా టైటిల్ రివీలైంది. అతడి ఫస్ట్ లుక్ కూడా బయటికి వచ్చేసింది. ఉబెర్ కూల్.. స్టైలిష్ లుక్ లో ఉన్న మహేష్ ను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. టైటిల్ డిజైన్ కూడా జనాల్ని ఆకట్టుకుంది. నిన్న సాయంత్రం ఫస్ట్ లుక్ లాంచ్ అయితే.. ఉదయం నుంచే సోషల్ మీడియాలో మహేష్ అభిమానుల సందడి మొదలైంది.

స్పైడర్ హ్యాష్ ట్యాగ్ ఇండియా అంతటా ట్రెండ్ అయ్యేలా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉదయం నుంచి అదే నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది. ఇక ఫస్ట్ లుక్ రిలీజయ్యాక సోషల్ మీడియా మోతెక్కిపోయిందంతే. ఈ రోజుకు కూడా ‘స్పైడర్’ హ్యాష్ ట్యాగే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు మెజారిటీ జనాలు స్పైడర్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.

ఐతే మహేష్ లుక్ మీద విమర్శలు గుప్పిస్తూ.. కామెడీ చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ముఖ్యంగా ఏ హీరో లుక్ రిలీజైనా యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ పబ్లిసిటీ చేయడానికి రెడీగా ఉంటారు. ‘స్పైడర్’ విషయంలోనూ అది తప్పలేదు. టీషర్టులో ఉన్న మహేష్ లుక్ చూసి.. ‘శ్రీమంతుడు’లోనూ ఇదే టీషర్ట్.. ఇప్పుడు కూడా మళ్లీ అదే టీషర్ట్ వేసుకుని సేమ్ లుక్ లో వచ్చేశాడు అంటూ మహేష్ మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక టక్ చేసుకుని టిప్ టాప్ గా ఉన్న ఇంకో లుక్ గురించి రెస్పాండవుతూ.. ఇది సియారామ్స్ వాళ్ల సూటింగ్స్ షర్టింగ్స్ కు ప్రచారం చేస్తున్నట్లుగా ఉందంటూ దాని మీదా కామెడీలు చేస్తున్నారు

,  ,  ,  ,  ,  ,