Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2014 10:53:33
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హాను తెలుగు సినిమాల్లో నటింపజేయాలని కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఈ క్రమంలో త్వరలో ఆమె ఓ తెలుగు సినిమాలో... అందులోనూ మెగా హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి చరణ్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. త్వరలో మొదలయ్యే ఈ సినిమా కోసం సోనాక్షిని అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే వున్నట్టు సమాచారం.

,  ,  ,  ,  ,  ,