Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 16:12:32
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ రిలీజ్ అయ్యేవరకు సినిమా గురించి గాసిప్స్ ఆగేలా లేవు. చిత్రం మొదలైనప్పటి నుండి ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. అనేక రకాలుగా అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ తో అయితే మురగదాస్ చాలా థ్రిల్ చేశాడు. అయితే అందులో అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.

ఏ మాత్రం మెయిన్ పాయింట్స్ ను ట్రైలర్ లో లేకుండా చూసుకున్నాడట. ముఖ్యంగా సినిమా లో హై లెవెల్ లో ఉండే విజువల్ ఎఫెక్ట్ ఎపిసోడ్స్ ని ఏ మాత్రం ట్రైలర్ లో పెట్టకూడదని దర్శకుడు చెప్పాడట. కేవలం ఆ గ్రాఫిక్స్ ను పెద్ద స్క్రీన్స్ పైన చుస్తేనే చాలా థ్రిల్ గా ఉంటుందని చెప్పడంతో చిత్ర యూనిట్ ఆ రెండు స్పెషల్ ఎపిసోడ్స్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ ని ఏ మాత్రం టచ్ చేయలేదని తెలుస్తోంది.

మహేష్ మొదటి సారి ఈ ప్రయోగాత్మకైనా సినిమాతో వస్తుండడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు టెక్నాలజీతో కనుగొని దాన్ని అంతమొందించే ఐబి అధికారిగా మహేష్ కనిపించబోతున్నాడు.

,  ,  ,  ,