Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2017 11:23:36
facebook Twitter Googleplus
Photo

మొత్తానికి మహేష్ బాబు అభిమానుల నిరీక్షణ మరి కొన్ని నెలలు కొనసాగక తప్పదని తేలిపోయింది. స్పైడర్ సినిమాను జూన్ 23 నుంచి వాయిదా వేయబోతుండటం వాస్తవమే అని తేలిపోయింది. ఐతే కనీసం జులైలో అయినా సినిమా వస్తుందా అంటే సందేహమే అంటున్నారు. మరి నెక్స్ట్ పాజిబుల్ డేట్ ఏంటి అన్నది నిన్నటిదాకా క్లారిటీ లేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం స్పైడర్ విడుదలకు ఒక టెంటేటివ్ డేట్ వినిపిస్తోంది. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. ఈ డేటుకున్న ప్రాధాన్యమేంటో మహేష్ అభిమానులకు బాగా తెలుసు. నవతరం సూపర్ స్టార్ పుట్టిన రోజు ఆ రోజే. స్పైడర్ విడుదలకు ఆ రోజునే ఫిక్స్ చేసినట్లుగా స్పైడర్ యూనిట్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

స్సైడర్ కొత్త షెడ్యూల్ మొదలైందని.. సినిమా షూటింగ్ మొత్తం మే నెలాఖరుకు పూర్తవుతుందని సీనియర్ పీఆర్వో బీఏ రాజు ప్రకటించారు. మేకు షూటింగ్ అయిపోతే ఆగస్టు వరకు సినిమాను రిలీజ్ చేయకపోవడం ఏంటని సందేహం కలగొచ్చు. ఐతే ఈ సినిమాలో వీఎఫెక్స్ పార్ట్ కీలకమని.. దాని కోసం ఆలస్యమవుతోందని అంటున్నారు. జులైకి కూడా సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఆగస్టు దాటితే.. సెప్టెంబరు నెల కోసం మూడు భారీ సినిమాలు ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేసుకోవాలి. మహేష్ పుట్టిన రోజు కలిసొస్తుండటం.. ఇండిపెండెన్స్ డే వీకెండ్ కూడా ప్లస్సయ్యే అవకాశం ఉండటంతో ఆగస్టు 9నే సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట

,  ,  ,  ,  ,  ,  ,